Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

కొండమీద హోటల్.. ఎక్కితే గుండె గుభేల్ !

scenic or scary.. this insane hotel will hang off a 1981 foot cliff, కొండమీద హోటల్.. ఎక్కితే గుండె గుభేల్ !

సరదాగా హోటల్ కెళ్ళి టిఫిన్స్ గానీ, మీల్స్ గానీ చేయాలనుకుంటే మాత్రం టర్కీలో కుదరదు. ఎందుకంటే అక్కడ ఓ పెద్ద కొండమీదే కట్టాలనుకుంటున్నారో హోటల్ని.. ఇస్తాన్ బుల్ లోని ఓ పాపులర్ స్థూడియో ఒకటి ‘ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ ‘ పేరిట ఈ హోటల్ ప్లాన్ ని డిజైన్ చేసింది. సదర్న్ నార్వే సరిహద్దుల్లో 1981 అడుగుల ఎత్తయిన ‘ పుల్పిట్ రాక్ ‘ అనే కొండమీద కట్టనున్నారు దీన్ని. ఈ శిఖరానికి పొడిగింపుగా.. మూడు అంతస్తులు, వాటి కింద ఓ స్విమ్మింగ్ పూల్.. బయటికి చొచ్చుకొచ్చిన విశాలమైన బాల్కనీతో.. ఉండబోతోందిట ఇది.. వచ్చిన గెస్టులు, కస్టమర్లు అక్కడ నిలబడి నార్వేలోని ప్రకృతి రమణీయకతను చూస్తూ తనివి తీరా ఆస్వాదించవచ్ఛు. థ్రిల్ కోరేవారికి,అడ్వెంచరిస్టులకు ఈ రాబోయే హోటల్ స్వర్గధామమే అంటున్నారు. ‘ హైరీ అటక్ ‘ అనే ఆర్కిటిక్ట్ ఊహలకు అనుగుణంగా ఉండబోతున్న ఈ హోటల్ ప్రాజెక్టుకు ఇంకా ప్రభుత్వ అనుమతి రావలసి ఉంది. అటు దీని తాత లాంటి మరో హోటల్ లండన్లో ఏర్పాటు కానుంది. 55 అంతస్థుల కింద అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ తో ఉండబోతోందిట ఇది..

Related Tags