మోదీ, అమిత్ షాలపై.. సుప్రీంకు కాంగ్రెస్ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. మోదీ, షా చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల నియమావళిని అతిక్రమించేవిగా ఉన్నాయని, అయినా ఈసీ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. వారి విద్వేషపూరిత ప్రసంగాల తాలూకు ఆధారాలను సుప్రీంకు సమర్పించినట్లు ఆమె చెప్పారు. దీనిపై […]

మోదీ, అమిత్ షాలపై.. సుప్రీంకు కాంగ్రెస్ ఫిర్యాదు
Follow us

|

Updated on: Apr 29, 2019 | 4:24 PM

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. మోదీ, షా చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల నియమావళిని అతిక్రమించేవిగా ఉన్నాయని, అయినా ఈసీ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. వారి విద్వేషపూరిత ప్రసంగాల తాలూకు ఆధారాలను సుప్రీంకు సమర్పించినట్లు ఆమె చెప్పారు. దీనిపై ఈసీకి వెంటనే ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె కోరారు.