అయోధ్య వివాదం.. నేడు సుప్రీంలో విచారణ

అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. స్థల వివాద పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘మధ్యవర్తిత్వం’ వల్ల ఎలాంటి పురోగతి కనిపించ లేదు. దీంతో కేసును సత్వరం విచారించాలంటూ ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ కోర్టును కోరారు. దానిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. విచారణకు అవసరమైన అఫిడవిట్‌ను సమర్పించాలని సూచించింది. ఆమోదయోగ్యమైన పరిష్కారం […]

అయోధ్య వివాదం.. నేడు సుప్రీంలో విచారణ
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 2:47 AM

అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. స్థల వివాద పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘మధ్యవర్తిత్వం’ వల్ల ఎలాంటి పురోగతి కనిపించ లేదు. దీంతో కేసును సత్వరం విచారించాలంటూ ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ కోర్టును కోరారు. దానిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. విచారణకు అవసరమైన అఫిడవిట్‌ను సమర్పించాలని సూచించింది.

ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మొహమ్మద్ ఇబ్రహిం కలిఫుల్లా అధ్యక్షతన త్రిసభ్య కమిటీని అత్యున్నత న్యాయస్థానం గత మార్చి 8న ఏర్పాటు చేసింది. ప్యానల్‌లో శ్రీ శ్రీ రవిశంకర్, మద్రాసు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచూ ఉన్నారు. చర్చలు ఫలప్రదమయ్యేలా చూసేందుకు మధ్యవర్తిత్వ ప్రక్రియ వివరాలను గోప్యంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు మధ్యవర్తుల కమిటీని అదేశించింది. వివాద పరిష్కారానికి ఆగస్టు 15 వరకూ గడువు ఇచ్చింది.