జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీం స్టే!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అర్ముగస్వామి కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో అపోలో ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో ఆపోలో ఆస్పత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఈ  కేసును విచారించి..జస్టిస్ అర్ముగ స్వామి కమిటీ విచారణపై స్టే విధించింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించడంపై […]

జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీం స్టే!
Follow us

|

Updated on: Apr 26, 2019 | 4:26 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అర్ముగస్వామి కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో అపోలో ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో ఆపోలో ఆస్పత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఈ  కేసును విచారించి..జస్టిస్ అర్ముగ స్వామి కమిటీ విచారణపై స్టే విధించింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం అర్ముగస్వామి  కమిటీని నియమించింది.