ప్రముఖ రచయిత జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు..

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదైంది. కరోనాపై ఆయన పాడిన పద్యం చిక్కుల్లో పడేసింది. అంటరానితనాన్ని ప్రోత్సహించే విధంగా, ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా జొన్న విత్తుల పద్యం రాశారంటూ..

ప్రముఖ రచయిత జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 02, 2020 | 12:43 PM

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదైంది. కరోనాపై ఆయన పాడిన పద్యం చిక్కుల్లో పడేసింది. అంటరానితనాన్ని ప్రోత్సహించే విధంగా, ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా జొన్న విత్తుల పద్యం రాశారంటూ.. తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాం ప్రసాద్ హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కరోనా వైరస్‌పై అవగాహన తెచ్చేందుకు పలువురు రచయితలు ఇప్పటికే పలు పాటలు రాశారు. అయితే జొన్న విత్తుల కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ పద్యం పాడారు. ప్రస్తుతం ఈ పాట విదాస్పదంగా మారింది. ఈ పద్యంలో బ్రాహ్మణ సమాజాన్ని పొగుడుతూ, దళితులని కించపరిచే విధంగా జొన్న విత్తుల వ్యాఖ్యలు చేశారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అయితే జొన్న విత్తుల మాత్రం తన వ్యాఖ్యలని సమర్థించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మానవజాతి మడికట్టుకుని ఉంది. మడి అంటే నువ్వు నన్ను తాకవద్దు అని అర్థం వస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నది కూడా ఇదేనని.. ఎవరినో కించపరచాలని తాను ఈ పద్యం పాడలేదని అంటున్నారు జోన్నవిత్తుల.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు

మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి