ప్రైవేటు ఆస్పత్రుల్లో.. కరోనా ఫీజులపై వివరణ ఇవ్వండి: సుప్రీం

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే, కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో.. కరోనా ఫీజులపై వివరణ ఇవ్వండి: సుప్రీం
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 3:38 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే, కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిద్ పేషేంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అందువల్ల చాలా మంది బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వాటి సేవలు అందుబాటులో లేవని పిటిషనర్ అవిషేక్ గోయెంకా కోర్టుకు తెలిపారు.

కరోనా పేషేంట్ల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజుపై అధిక పరిమితిని విధించడంపై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా, వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం.. కేంద్రం స్పందనను కోరింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోవిద్ పేషేంట్ల చికిత్సపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతంలో విచారించింది.

‘ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని పొందిన ప్రైవేట్, ఛారిటబుల్ ఆస్పత్రులను కోవిద్ రోగులకు ఉచితంగా చికిత్స చేయమని కోరవచ్చా’ అని గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. అయితే, కోవిద్ రోగులకు ఉచితంగా చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించే చట్టబద్ధమైన అధికారం తమకు లేదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ