తప్పుడు ప్రచారం చేస్తోంది.. ఈమెను అరెస్టు చేయండి

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలైన షెహ్లా రషీద్ పై సుప్రీంకోర్టు లాయర్ అలోక్ శ్రీవాస్తవ క్రిమినల్ కేసు పెట్టారు. కాశ్మీర్ లోని పరిస్థితిపై ఆమె నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. .కాశ్మీర్లో ఆర్మీకి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈమె ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తోందని, ఈమెను అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే షెహ్లా రషీద్ … జమ్మూకాశ్మీర్ లోని పరిస్థితిపై ఇటీవల వరుస […]

తప్పుడు ప్రచారం చేస్తోంది.. ఈమెను అరెస్టు చేయండి
Follow us

|

Updated on: Aug 19, 2019 | 5:48 PM

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలైన షెహ్లా రషీద్ పై సుప్రీంకోర్టు లాయర్ అలోక్ శ్రీవాస్తవ క్రిమినల్ కేసు పెట్టారు. కాశ్మీర్ లోని పరిస్థితిపై ఆమె నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. .కాశ్మీర్లో ఆర్మీకి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈమె ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తోందని, ఈమెను అరెస్టు చేయాలని ఆయన కోరారు. ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే షెహ్లా రషీద్ … జమ్మూకాశ్మీర్ లోని పరిస్థితిపై ఇటీవల వరుస ట్వీట్లు చేసింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలపై పోలీసులకు అధికారమంటూ లేదని, అధికారాలన్నీ పారామిలిటరీ దళాల చేతిలో ఉన్నాయని ఆమె పేర్కొంది. కేవలం ఒక సిఆర్ఫీ జవాన్ చేసిన ఫిర్యాదుపై ఓ పోలీసు అధికారిని బదిలీ చేశారని, ఆ అధికారి వద్ద సర్వీసు రివాల్వర్ లేకపోగా చేతిలో లాఠీ పట్టుకు తిరుగుతున్నాడని షెహ్లా తెలిపింది. అయితే ఇదంతా అవాస్తవమని, కట్టుకథ అని లాయర్ అలోక్ శ్రీవాస్తవ ఖండించారు.రాష్ట్రంలో పోలీసులకు, భద్రతా దళాలకు సమాన అధికారాలున్నాయని అన్నారు. అటు-ఇండియన్ ఆర్మీ కూడా ఆమె ఆరోపణలను తోసిపుచ్చింది. కాశ్మీర్ లో తన పాపులారిటీ కోసమే ఆమె ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని భారత దళాలు స్పష్టం చేశాయి.