ఆ చిన్నారులకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందించండి..రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశం

సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ కేర్ సెంటర్స్ నుంచి ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు విద్యా సాయం కింద నెలకు రూ.2,000 చొప్పున చెల్లించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఆ చిన్నారులకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందించండి..రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశం
Follow us

|

Updated on: Dec 15, 2020 | 5:32 PM

సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ కేర్ సెంటర్స్ నుంచి ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు విద్యా సాయం కింద నెలకు రూ.2,000 చొప్పున చెల్లించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి వల్ల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితిని అత్యున్నత న్యాయస్థానం సుమోటాగా తీసుకుంది. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన జస్టిస్​ ఎల్​. నాగేశ్వర్​ రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేందుకు వారికి కావాల్సిన పుస్తకాలు, పరికరాలు, శానిటైజరీ ఉత్పత్తులు అందించాలని సూచించింది.

కొవిడ్​ కంటే ముందు సీసీఐలలో 2,27,518 పిల్లలు ఉండగా.. 1,45,788 మంది ఇళ్లలో పునరావాసం కోసం వెళ్లారని ధర్మాసనం చెప్పింది. జల్లా చిన్నారుల సంరక్షణ విభాగం(డీసీపీయూ) సూచనల ప్రకారం ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోగా అందించాలని పేర్కొంది. సీసీఐలలోని చిన్నారుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి..వారికి మెరుగైన జీవనం అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాల గురించి జిల్లా న్యాయసేవల సంస్థకు డీసీపీయూలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది.

సీసీఐలలోని చిన్నారులకు ఆన్​లైన్​ క్లాసులకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలని ఈ కేసులో అమికస్​ క్యూరీగా వ్యవహరించిన న్యాయవాది గౌరవ్​ అగర్వాల్​ వాదనలు వినిపించారు. జాతీయ బాలల హక్కల పరిరక్షణ కమిషన్​ తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. అమికస్​ క్యూరీ సూచనలను స్వాగతించారు. చెల్డ్ కేర్ సెంటర్లను పర్యవేక్షించేదుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Also Read :

ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?

55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.