ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అమల్లోకి ఆ తగ్గింపు నిర్ణయం

SBI repo-linked home loan rates down to 8.05% from September 1, ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అమల్లోకి ఆ తగ్గింపు నిర్ణయం

దేశీయ బ్యాంగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. ఈ జూలైలో రెపో లింక్డ్ హోమ్ లోన్స్‌ను ఎస్బీఐ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ రెపో లింక్డ్ హోమ్ లోన్ ప్రకారం.. గృహ రుణాలను 8.05 శాతం వడ్డీ రేటుకే పొందొచ్చు. ఇదివరకు వడ్డీ రేటు 8.4 శాతంగా ఉండేది. రూ.75 లక్షలలోపు రుణాలకు ఇది వర్తిస్తుంది. ఇక రూ.75 లక్షలకు పైన రుణాలకు వడ్డీ రేటు 8.75 శాతంగా ఉండొచ్చు. దీనికి కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.

కాగా స్టేట్ బ్యాంక్ రెపో లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేటు ఆర్ఎల్ఎల్ఆర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ఆర్‌బీఐ రెపో రేటుకు 225 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. ఆర్‌బీఐ ఎప్పుడైతే రెపో రేటును మారుస్తుందో, అప్పుడు ఎస్‌బీఐ ఆర్ఎల్ఎల్ఆర్ కూడా ఆటోమేటిక్‌గా మారుతుంటుంది. మరోవైపు ఎస్‌బీఐ ఈ ఆఫర్ ప్రకటించిన తరువాత పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు కూడా రెపో లింక్డ్ హోమ్ లోన్స్ అందిస్తామని ప్రకటించాయి. మరిన్ని బ్యాంకులు కూడా వీటి దారిలోనే నడిచే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *