Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

SBI Microsoft: యువతకు గుడ్ న్యూస్.. బ్యాంకింగ్ రంగంలో అద్భుత అవకాశాలు!

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో దివ్యాంగ యువతకు అవకాశాలు కల్పించడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా ఎస్‌బీఐ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్
SBI Microsoft, SBI Microsoft: యువతకు గుడ్ న్యూస్.. బ్యాంకింగ్ రంగంలో అద్భుత అవకాశాలు!

SBI Microsoft: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో దివ్యాంగ యువతకు అవకాశాలు కల్పించడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా ఎస్‌బీఐ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ కోర్టోయిస్ కలిసి మూడేళ్ల ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేశారు. BFSI రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా దివ్యాంగులకు టెక్నాలజీలో శిక్షణ అందిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ నుంచి మొదటి ఏడాదిలోనే 500 మందికి శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.

ఈ కార్యక్రమం వివిధ ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల నైపుణ్య సంస్థలు, లాభాపేక్షలేని సంస్థల సహకారంతో నడుస్తుంది.ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి యువతకు సరైన శిక్షణ ఇవ్వడంతో పాటు, దివ్యాంగులు సరైన నైపుణ్యాలతో ఈ రంగంలో అడుగుపెట్టేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ రంగంలో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఎస్‌బీఐ, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా కృషి చేయనున్నాయి.

భారతదేశంలో 26 మిలియన్లకు పైగా దివ్యాంగులు 21 వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా పాల్గొనడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి కొత్త మార్గాలను కనుగొనడం చాలా అవసరం. ఎస్బిఐ ఫౌండేషన్తో భాగస్వామ్యం చేయడం ద్వారా దివ్యాంగులు బిఎస్ఎఫ్ఐ రంగానికి ప్రయోజనం కలిగించే అద్భుతమైన అవకాశం ఉంది అని కోర్టోయిస్ చెప్పారు.

SBI Microsoft, SBI Microsoft: యువతకు గుడ్ న్యూస్.. బ్యాంకింగ్ రంగంలో అద్భుత అవకాశాలు!

27/02/2020,4:39PM

Related Tags