ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. కస్టమర్లకు పండగే!

బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించబడ్డాయి. ఆర్‌బిఐ తన సర్క్యులర్‌లో, రిటైల్ రుణ వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో దేశంలోనే అతి పెద్దబ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఎస్బిఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటు (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు […]

ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. కస్టమర్లకు పండగే!
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 4:44 PM

బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించబడ్డాయి. ఆర్‌బిఐ తన సర్క్యులర్‌లో, రిటైల్ రుణ వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో దేశంలోనే అతి పెద్దబ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఎస్బిఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటు (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు 8.05 శాతం నుంచి 7.8 శాతానికి దిగొచ్చింది. ఈ తగ్గింపు 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయంతో ప్రస్తుత హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు దిగిరానుంది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణాలు తీసుకునే ఎంఎస్ఎంఈలకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.

కొత్త సంవత్సరంలో హోమ్ లోన్స్ తీసుకునే వారికి 7.9 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేటు ఆర్బీఐ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు ప్రస్తుతం 5.15 శాతంగా ఉంది.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!