ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ!

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. కొత్త వాటిని నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో డిపాజిట్ దారులకు షాక్ తగినట్లేనని చెప్పాలి. సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష వరకు ఉన్న నగదుకు 3.5 శాతం వడ్డీ రేటును.. 3.25 శాతానికి తగ్గించనుంది. అంతేకాకుండా […]

ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ!
Follow us

|

Updated on: Oct 31, 2019 | 10:48 PM

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. కొత్త వాటిని నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో డిపాజిట్ దారులకు షాక్ తగినట్లేనని చెప్పాలి.

సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష వరకు ఉన్న నగదుకు 3.5 శాతం వడ్డీ రేటును.. 3.25 శాతానికి తగ్గించనుంది. అంతేకాకుండా రూ.1 లక్ష పైన డిపాజిట్లు ఉన్న కస్టమర్లు ఇకపై పావు శాతం తక్కువ వడ్డీని పొందుతారు. బ్యాంక్ దగ్గర కావాల్సినంత లిక్విడిటీ ఉండటంతో వడ్డీ రేట్లు తగ్గించమని తెలిపింది. ఇకపోతే కొద్దిరోజుల కిందట ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రెపో రేట్‌ను తగ్గించిన తర్వాతే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా. నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త వడ్డీ రేట్ల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే.. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.