Breaking News
 • ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్‌ ఇండియా. జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా ఏ నగరాన్ని చూపని సర్వే ఆఫ్‌ ఇండియా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ విడుదల చేసిన సర్వేఆఫ్‌ ఇండియా.
 • యాదాద్రి: బైక్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు. భర్త రాంరెడ్డి మృతి, భార్య రాధకు తీవ్రగాయాలు. భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర ఘటన.
 • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
 • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.
 • ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు కష్టానికి తప్ప. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు. అమరావతిని చేర్చి సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ విడుదల చేసేలా లోక్‌సభలో పోరాడిన గల్లా జయదేవ్‌కు అభినందనలు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌

SBI ఖాతాదారులకు షాక్… అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

SBI customer? ALERT! Know new charges from Oct 1 on ATM transactions cheque use and internet banking, SBI ఖాతాదారులకు షాక్… అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

మీకు దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే బ్యాంక్ మీకు షాకివ్వబోతోంది. 2019 అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారుస్తోంది. బ్యాంక్ చార్జీలు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇవి మనీ విత్‌డ్రా, చెక్ బుక్ వినియోగం, మనీ డిపాజిట్, సర్వీస్ చార్జీలు, ఏటీఎం లావాదేవీలు ఇలా పలు వాటికి సంబంధించినవి. వివరాల్లోకెళితే…

 • స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేయగలరు. ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్‌టీ అదనం. ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.
 • చెక్ బుక్ విషయానికి వస్తే చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.
 • అలాగే ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో 10కు పెరగనున్నాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఇది వర్తిస్తుంది.
 • ఇకపోతే నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో 12 లావాదేవాలు నిర్వహించొచ్చు. అదే ఇత బ్యాంకుల ఏటీఎం అయితే 5 లావాదేవీలు మాత్రమే ఉచితం.
 • ఉద్యోగులకు బంపరాఫర్ అందుబాటులోకి రానుంది. బ్యాంక్ వద్ద శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
 • ఇకపోతే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంది. అదే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ సేవలు పొందాలంటే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు.
 • ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ పని చేస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి రూల్ అమలులోకి వస్తుంది.