ఎస్‌బీఐ అద్భుత ఆఫర్.. ఉచితంగా సెల్‌ఫోన్ల అట!

బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు అద్భుతమైన పండగ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారందరికి ఈ ఆఫర్ పరిగణలోకి వస్తుంది. దీని కోసం ఎస్‌బీఐ వివిధ రకాల బ్రాండ్లతో జతకట్టింది. ఎస్‌బీఐ ఇండియా దీపావళి ఆఫర్‌లో భాగంగా టాప్ స్పెండర్లు రూ.లక్ష విలువైన హాలిడే వోచర్‌ను గెలుచుకోవచ్చు. మేక్ మై ట్రిప్ యాప్ ఈ వోచర్‌ను అందిస్తోంది. అలాగే షావోమి స్మార్ట్‌ఫోన్స్‌, స్మార్ట్ డివైజ్‌లను ఉచితంగానే గెలుచుకోవచ్చు. ఎస్‌బీఐ మెగా […]

  • Ravi Kiran
  • Publish Date - 12:39 am, Wed, 9 October 19

బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు అద్భుతమైన పండగ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారందరికి ఈ ఆఫర్ పరిగణలోకి వస్తుంది. దీని కోసం ఎస్‌బీఐ వివిధ రకాల బ్రాండ్లతో జతకట్టింది. ఎస్‌బీఐ ఇండియా దీపావళి ఆఫర్‌లో భాగంగా టాప్ స్పెండర్లు రూ.లక్ష విలువైన హాలిడే వోచర్‌ను గెలుచుకోవచ్చు. మేక్ మై ట్రిప్ యాప్ ఈ వోచర్‌ను అందిస్తోంది. అలాగే షావోమి స్మార్ట్‌ఫోన్స్‌, స్మార్ట్ డివైజ్‌లను ఉచితంగానే గెలుచుకోవచ్చు. ఎస్‌బీఐ మెగా ప్రైజ్, వీక్లి ప్రైజ్, డైలీ ప్రైజ్, అవర్లీ ప్రైజ్‌లను అందిస్తుంది.

అవర్లీ ప్రైజ్ కింద రూ.1000 విలువ చేసే పుమా గిఫ్ట్ వోచర్ గెలుచుకోవచ్చు. డైలీ ప్రైజ్ కేటగిరీలో రూ.7000 వైర్‌లెస్ హెడ్ ఫోన్స్.. వీక్లీ కేటగిరీలో రూ. 17,499ల ఎంఐ ఏ3 ఫోన్ ఉచితంగా గెలుపొందొచ్చు. ఇక ఈ ఆఫర్ అక్టోబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. కాగా, ఇటీవల ఎస్‌బీఐ అమెజాన్‌తో జత కట్టి.. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.