హద్దు దాటారా అంతే సంగతులు..15 నుంచి ఛార్జీల మోతే..!

మీకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉందా..?  ఐతే మీపై అదనపు భారం పడబోతోంది. ఈ నెల 15 నుంచి రోజువారీ లావాదేవీలపై వడ్డనకు రెడీ అవుతోంది. పరిమితికి మించి జరిపే లావాదేవీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. డబ్బు డిపాజిట్ చేయాలన్నా, విత్‌ డ్రా చేయాలన్నా ఛార్జీలు చెల్లించాల్సిందే. ఐతే అందుకు ఓ లిమిట్‌ ఉంది. నెలకు నాలుగు సార్లు మాత్రమే ట్రాన్జాక్షన్స్‌ ఉచితంగా చేసుకోవచ్చు. […]

హద్దు దాటారా అంతే సంగతులు..15 నుంచి ఛార్జీల మోతే..!
Follow us

|

Updated on: Dec 05, 2019 | 5:39 PM

మీకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉందా..?  ఐతే మీపై అదనపు భారం పడబోతోంది. ఈ నెల 15 నుంచి రోజువారీ లావాదేవీలపై వడ్డనకు రెడీ అవుతోంది. పరిమితికి మించి జరిపే లావాదేవీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. డబ్బు డిపాజిట్ చేయాలన్నా, విత్‌ డ్రా చేయాలన్నా ఛార్జీలు చెల్లించాల్సిందే. ఐతే అందుకు ఓ లిమిట్‌ ఉంది. నెలకు నాలుగు సార్లు మాత్రమే ట్రాన్జాక్షన్స్‌ ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ఛార్జీల మోత మోగుతుంది. ప్రతి ట్రాన్జాక్షన్‌పై 150 రూపాయల పెనాల్టీ పడుతుంది. ఇక అకౌంట్‌ ఓపెన్‌ చేసిన బ్యాంక్‌కు వెళ్లి 2 లక్షల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. లేదా విత్‌ డ్రా చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతి వెయ్యి రూపాయలకు..5 రూపాయలు లేదా గరిష్టంగా 150 రూపాయల పెనాల్టీ పడుతుంది. అలాగే రోజువారీ జరిపే లావాదేవీల్లో భాగంగా రూ.25 వేల వరకు ఉచిత పరిమితిని ప్రకటించింది. అంతకు మించితే వెయ్యి రూపాయలకు గాను రూ.5 లేదా కనీసం రూ.150  ఛార్జీ వడ్డన ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌కు అయితే రూ.150 చార్జీ పడుతుంది. అలాగే రోజుకు రూ.25,000 వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించొచ్చు. పరిమితి దాటితే భారీ షాక్‌ తగలనుంది.