సౌదీ మహిళలూ.. మీకు “గుడ్ న్యూస్”.. ఇక పై ఒంటరిగా..

Saudi Allows Women To Get Passports: Go Abroad Without Male Guardians nod, సౌదీ మహిళలూ.. మీకు “గుడ్ న్యూస్”.. ఇక పై ఒంటరిగా..

సౌదీ మహిళలపై ఈ మధ్య కాలంలో వివక్ష తగ్గుతోంది. తాజాగా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ.. అక్కడి ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు తీసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ నిర్ణయానికి చాలామంది మద్దతు తెలుపగా, కొందరు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్దమంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా నేటి నుంచి ఈ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు విభాగం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గార్డియన్ షిప్ చట్టం ప్రకారం.. సౌదీకి చెందిన మహిళలు ఒంటరిగా ఎక్కడి వెళ్లకూడదు. స్కూల్ కానీ, కాలేజ్ కాని, మరే ఇతర ప్రాంతాలైన వారితో పాటు తండ్రి కాని, బ్రదర్ కాని ఎవరు ఒకరిని వెంటపెట్టుకుని వెళ్లాలి. అయితే గత కొద్ది రోజులుగా.. మహిళ ప్రగతి కోసం సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు. గార్డియన్‌షిప్‌ చట్టాన్ని భరించలేక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు సౌదీ నుంచి పారిపోయి విదేశాల్లో నివాసం ఉంటున్నారు. ఇలా ఇకపై జరగకుండా ఉండాలని వారు కూడా స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని.. గార్డియన్ షిప్ చట్టంలో అక్కడి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *