Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ఖషోగీ హత్యకేసులో సౌదీ యువరాజు హస్తం ఉందా?

, ఖషోగీ హత్యకేసులో  సౌదీ యువరాజు హస్తం ఉందా?

సంచలనం రేపిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్  ఖషోగీ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.  ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి తమ వద్ద అన్ని అధారాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల నిపుణురాలు ఆగ్నస్ కాల్ మార్డ్  ఒక నివేదికలో  వెల్లడించారు.

గత ఏడాది అక్టోబర్ 2న వాషింగ్టన్ పోస్ట్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నజమాల్ ఖషోగీ టర్కీలో దారుణంగా చంపబడ్డారు.  టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో ఖషోగీ హత్యకు గురయ్యారు.  అయితే ఈ దారుణం వెనుక సౌదీ రాజ కుటుంబం ఉన్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఖషోగీ హత్య  కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాత్ర ఉందని ఆగ్నస్ కాల్ మార్డ్ తన నివేదికలో బయటపెట్టారు. అయితే ఈ ఆరోపణలను మొదట్నుంచీ సౌదీ అరేబియా కొట్టిపారేస్తూనే ఉంది.   ఆయనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో  సౌదీ  ఇంతటి దారుణానికి పాల్పడిందనే ఆరోపణలు  ఉన్నాయి.

అయితే తాజాగా ఆగ్నస్ తన నివేదికలో సౌదీ యువరాజు విషయంలో కొన్ని ఆరోపణలు చేసారు. జర్నలిస్ట్ ఖషోగీ హత్యకేసులో తన వద్ద  ఖచ్చితమైన ఆధారాలున్నాయని, ఈ కేసులో యువరాజు బిన్ సల్మాన్ తోపాటు ఉన్నత స్ధాయి అధికారులను కూడా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖషోగీకి యువరాజుకు సంబంధించిన అన్ని విషయాలు తెలియడంతో ఎప్పుడూ భయపడుతూ ఉండేవారని తన దర్యాప్తులో తేలినట్టుగా ఆగ్నస్ తన నివేదికలో వెల్లడించారు.

Related Tags