సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. ‘ఈద్’ సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ..!

కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. అటు గ‌ల్ఫ్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. 'ఈద్' సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ..!
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 2:29 PM

Saudi Arabia: కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. అటు గ‌ల్ఫ్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లో విరుచుకుప‌డుతోంది. దాంతో కోవిద్-19 క‌ట్ట‌డికి ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాలు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తాజాగా క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

వివరాల్లోకెళితే.. ఈద్ ఉల్ ఫిత‌ర్ సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో సెలవులు ఉండే ఆ ఐదు రోజుల్లో(మే 23 నుంచి 27 వ‌ర‌కు) సైతం సౌదీలో 24 గంట‌ల క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రానుంది. ఈ మేర‌కు అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌క్కా మిన‌హా సౌదీలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌నున్నారు.

కాగా.. సౌదీలో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 264 మంది చ‌నిపోయారు. 42,925 మందికి ఈ వైర‌స్ సోకింది.