నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..?: మెగాస్టార్‌పై యువ నటుడి పోస్ట్‌

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు, స్వయం కృషితో మెగాస్టార్‌గా ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..?: మెగాస్టార్‌పై యువ నటుడి పోస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 12:45 PM

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు, స్వయం కృషితో మెగాస్టార్‌గా ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనను ఇన్ఫిరేషన్‌గా తీసుకొని ఎంతోమంది నటీనటులు టాలీవుడ్‌కి వచ్చి రాణిస్తున్నారు. వారిలో కొంతమంది చిరును కలిసి తమ అభిమానాన్ని చాటుకోగా.. తాజాగా యువ నటుడు సత్యదేవ్‌కి మెగాస్టార్‌ని కలిసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో జూలై 8న చిరును కలిశాడు సత్యదేవ్‌. ఇక ఇది జరిగిన 14 రోజులకు ‘అన్నయ్య’ అనుభవాలను సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ నటుడు.

”నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..? నా చిన్నప్పుడు మా క్లాస్‌ రూమ్ గోడ మీద ఒక పెద్ద స్కేల్‌ బొమ్మ ఉండేది. ఆరడుగుల దాకా గీసి, ఆపేశారు. రెండు, మూడు నెలలకొకసారి ఎంత పొడవు పెరిగామో కొలవడానికి ఒక్కొక్కరిని గోడకు అనుకొని నిలబడమనేవారు. ఒకరోజు మా టీచర్‌ని మాలో ఎవరైనా ఆ సీలింగ్‌ కన్నా పొడవు పెరిగితే ఎలా టీచర్ అని అడిగాను. అప్పుడు మా టీచర్ అడిగిన ప్రశ్న-నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..?. ఆ తరువాత చాలా సార్లు, చాలా చోట్ల అవే మాటలు విన్నాను. కష్టతరం, అసాధ్యం అనిపించే పనులు చేయడానికి ఎవరు పూనుకున్నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు అనే మాటలు ఇవి.

నేను సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు నాకు మళ్లీ అదే ప్రశ్న ఎదురుపడింది. నేను చిరంజీవిని అనుకోలేదు. కొన్ని కోట్ల మంది లాగా చిరంజీవి అవ్వాలనుకున్నాను. నేను ఏమి సాధించాను. ఎంత సాధించాలి అని కొలవటానికి నా లైఫ్‌ గోడ మీద నేను గీసుకున్న స్కేల్‌ చిరంజీవి. ఎవరెస్ట్ ఎక్కటానికి బయలుదేరిన ప్రతి ఒక్కడికీ అనుమానాలు, భయాలు తప్పవు. దారిలో ఊహించని అడ్డంకులు, కుంగదీసే గాయాలు, ఇక నా వల్ల కాదు అని వెనక్కి తిరిగి పోవాలనుకున్నప్పుడు.. ఆ శిఖరం మీద ఉన్న జెండా కనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం వస్తుంది. శక్తి పుంజుకొని మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాం. తెలుగు సినిమాల్లోకి నటుడవ్వాలని వచ్చిన నా లాంటి వేల మందికి చిరంజీవి అన్న వ్యక్తి ఆ జెండా.

మొన్న జూలై 8న చిరంజీవి గారిని వాళ్ల ఇంట్లో కలిశాను. ఆ యూఫోరియా నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కలలాగే ఉంఆది. సర్‌.. మీరు నాకు చెప్పిన ప్రతి మాటా గుర్తుంది. భద్రంగా నా మనసులో దాచుకుంటాను. చిరంజీవి గారిని కలవడానికి వెళ్తున్నాను.. అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ల నుంచి అదే ప్రశ్న. నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..?” అని ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ పోస్ట్‌లకు దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందిస్తూ.. అన్నయ్య నిన్ను ఎంత ఇన్‌స్ఫైర్‌ చేసుకుంటారో నేను ఊహించగలను. రాసిపెట్టుకో ఈ మీటింగ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది అని కామెంట్ పెట్టారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!