మహేశ్​బాబు​ సోదరిగా బాలీవుడ్ టాప్ స్టార్ !

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మహేశ్​బాబు​ సోదరిగా బాలీవుడ్ టాప్ స్టార్ !
Follow us

|

Updated on: Sep 16, 2020 | 5:16 PM

సూపర్​స్టార్ మహేశ్​బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. దీంతో నటీనటులను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ సోదరి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్​ నటించనున్నారట. ఈ విషయమై మేకర్స్ ఆమెను అప్రోచ్ అవ్వగా,  సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలలో బాలయ్య సరసన అలరించారు విద్యాబాలన్. కాగా ‘సర్కారు వారి పాట’ లో ఇప్పటికే అనిల్ కపూర్​ ను విలన్ గా ఫైనల్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

అమెరికా డెట్రాయిట్‌ నగరంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చేసేందుకు పరుశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతుంది. సుమారు నలభైఐదు రోజుల పాటు ఈ షెడ్యూల్​ సాగనుంది. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేశ్ హీరోయిన్ నటిస్తుండగా, తమన్‌ సంగీతమందిస్తున్నారు.

Vidya Balan – Mahesh Babu sister in Sarkaru Vaari Paata? - tollywood

Also Read :

ఇండియాకు 100 మిలియన్ మోతాదుల కరోనా వ్యాక్సిన్, ఈ ఏడాది చివరినాటికే..!

బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం