Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

సంక్రాంతి ‘బాస్’ ఎవరు? హాట్‌ హాట్ కామెంట్స్!

Sarileru vs Ala, సంక్రాంతి ‘బాస్’ ఎవరు? హాట్‌ హాట్ కామెంట్స్!

2020 సంక్రాంతి బాస్‌ ఎవరు? సంక్రాతికి మా హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటే.. మా హీరో కొట్టాడని ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. మరో పక్క చిత్ర బృందాలు కూడా సక్సెస్ మీట్‌లు పెట్టి.. మాది హిట్‌ అంటే మాది హిట్ అని చెప్పుకుంటున్నారు. మరి సంక్రాంతి మొనగాడు.. మొగుడు ఎవరు?

ఈ ఏడాది సంక్రాంతి సినీ పండుగ ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌గా మొదలయ్యిందనే చెప్పాలి. పొంగల్ బరిలో సూపర్ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు మరో ముగ్గురు హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు కూడా రేసులోకి దిగారు. అయితే ఇందులో కళ్యాణ్ రామ్ నటించిన మూవీ ‘ఎంత మంచివాడవురా’ ఇంకా రిలీజ్ కాలేదు.

Sarileru vs Ala, సంక్రాంతి ‘బాస్’ ఎవరు? హాట్‌ హాట్ కామెంట్స్! కాగా ఇప్పటికే రిలీజ్ అయిన దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల్లో.. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు మెయిన్ హైలైట్ అయ్యాయనే చెప్పాలి. సరిలేరు నీవెవ్వరు సినిమా ఈ నెల 11న రిలీజ్ అయ్యింది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్‌తో.. 95 కోట్ల గ్రాస్ దూసుకెళ్లింది. ఇక 12వ తేదీన అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఒక్క రోజే రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

ఇక ఆ తరువాత రోజునే.. ఈ రెండు చిత్రబృందాలు మూవీ సక్సెస్‌ మీట్‌లు పెట్టుకున్నాయి. సంబరాలు కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాట్ హాట్‌గా కామెంట్స్ కూడా బాగానే చేశారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల హిట్ విషయంలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్‌ అని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. మూడో రోజుకు సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా రూ. 103 కోట్లకు చేరుకుని బాక్సాఫీస్ రికార్డు బ్రేక్ చేసింది. అటు అల్లు అర్జున్ సినిమా కూడా రెండు రోజులకి దాదాపు 100 కోట్లు దాటినట్టు ఫిల్మ్ వర్గాల టాక్.

Sarileru vs Ala, సంక్రాంతి ‘బాస్’ ఎవరు? హాట్‌ హాట్ కామెంట్స్!

మరి ఇంతకీ ఇప్పడు సంక్రాంతి బాస్ ఎవరు? ఇదే విషయంపై తెలుగు ఇండస్ట్రీలో ఫుల్‌గా లొల్లి నడుస్తోంది. ఇప్పటివరకూ కలెక్షన్స్ పరంగా చూస్తే మహేష్‌ బాబే ముందున్నాడు. అటు దాదాపు అల్లు అర్జున్ కూడా మహేష్‌కి దగ్గరలోనే ఉన్నాడు. మరో రెండు వారాలు గడిస్తేగాని.. బాక్సాఫీస్ లెక్క తేలదు.