Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

అదే గ్రేస్, అదే మాస్..రాములమ్మ​ కిక్ చూశారా..?

Vijayashanthi Mind Blowing Master Kick After 13 Years, అదే గ్రేస్, అదే మాస్..రాములమ్మ​ కిక్ చూశారా..?

లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్.. విజయశాంతికి ఫ్యాన్స్ ఇచ్చుకున్న బిరుదులు. ఆమెకు ఆ ట్యాగ్స్ ఎప్పటికి వర్కవుట్ అవుతాయ్. ఎందుకంటారా..53 ఏళ్ల వయసులో ఈ మాజీ హీరోయిన్ చేసిన ఫీట్ చూస్తే మీరు అదే మాట అనడం ఖాయం. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది రాములమ్మ. ప్రొఫెసర్ పాత్రలో ఎవర్‌గ్రీన్ ఎమోషన్స్‌ను పండించింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఓ రేర్ వీడియోను మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు.

మరో నటుడు బ్రహ్మజీకి కాలితో కిక్ ఇస్తోన్న లేడీ అమితాబ్ వీడియో చూస్తే..అప్పట్లో ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్ గుర్తుకువస్తాయి. ఈ వీడియో విజయశాంతి అభిమానులను ఓ రేంజ్‌లో మెస్మరైజ్ చేస్తోంది. ఇన్నోళ్లు గడిచినా ఆమెలో అదే గ్రేస్, అదే మాస్ అంటూ కామెంట్స్ విసురుతున్నారు నెటిజన్లు