ఫుడ్ పాయిజన్… శరవణ భవన్‌పై 90 లక్షల దావా!

Sarvana Bhavan to pay compensation of Rs 1.10L to SC lawyer for mental agony, ఫుడ్ పాయిజన్… శరవణ భవన్‌పై 90 లక్షల దావా!

చెన్నై: తమిళనాడు‌లోని ప్రముఖ హోటల్ శరవణ భవన్ ‌పై ఓ వ్యక్తి దావా వేశాడు. తనకు చెడిపోయిన ఆహారాన్ని వడ్డించనందుకు గానూ 90 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరగ్గా.. తీర్పు సదరు వ్యక్తి అనుకూలంగా వచ్చింది. దీనితో అతడు డిమాండ్ చేసిన దానికంటే తక్కువగా లక్షా పదివేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అసలు వివరాల్లోకి వెళ్తే…

2014 అక్టోబర్‌లో ఓ వ్యక్తి చెన్నైలోని శరవణ భవన్‌లో భోజనానికి వచ్చాడు. ఇక అతడికి సర్వ్ చేసిన ఫుడ్‌లో వెంట్రుకలు రాగా.. బాధితుడు మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే ఆహారాన్ని మార్చిన యాజమాన్యం మరొకటి అందించింది. అది తిన్న కొన్ని గంటలకు ఆ వ్యక్తి కడుపులో గడబిడ మొదలైంది. నీరసించిపోయి సృహ తప్పి పడిపోగా.. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. ఫుడ్ పాయిజన్ దెబ్బకు సదరు వ్యక్తి మానసికంగా, శారీరికంగా కృంగిపోయాడు. దీంతో శరవణభవన్ మీద దావా వేశాడు. తాను ఎదుర్కొన్న మానసిక సంక్షోభానికి రూ.90లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. బాధితుడికి పరిహారం కింద రూ.లక్ష ఇవ్వాలని.. దానితో పాటు అతడి కోర్టు ఖర్చుల మరో రూ.10వేలు కూడా ఇవ్వాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *