వెరీ స్పెషల్‌ హార్స్‌ ..ప్రైస్‌ @రూ. 10 కోట్లు

ఓ గుర్రం ఖరీదు పది కోట్లంటే నమ్మగలరా..? కానీ, ఆ గుర్రం ఖరీదు అక్షరాల రూ. 10 కోట్లు అంటున్నారు దాని యజమాని. మహారాష్ట్రలోని సారంగ్‌ఖెడాలో జరుగుతున్న చెతక్‌ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ గుర్రం అందరిని ఎంతగానో ఆకర్షించింది. దాని పేరు “షాన్‌’. ఈ గుర్రం యజమాని తారాసింగ్‌..పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటారు. ఉత్సవానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. షాన్‌ మర్వాడీ జాతికి చెందిన గుర్రమని చెప్పారు. ఇది గుర్రాల పరుగుపందెంలో ఛాంపియన్‌గా నిలిచిందని చెప్పారు. ఎక్స్‌ప్రెస్ […]

వెరీ స్పెషల్‌ హార్స్‌ ..ప్రైస్‌ @రూ. 10 కోట్లు
Follow us

|

Updated on: Dec 23, 2019 | 3:59 PM

ఓ గుర్రం ఖరీదు పది కోట్లంటే నమ్మగలరా..? కానీ, ఆ గుర్రం ఖరీదు అక్షరాల రూ. 10 కోట్లు అంటున్నారు దాని యజమాని. మహారాష్ట్రలోని సారంగ్‌ఖెడాలో జరుగుతున్న చెతక్‌ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ గుర్రం అందరిని ఎంతగానో ఆకర్షించింది. దాని పేరు “షాన్‌’. ఈ గుర్రం యజమాని తారాసింగ్‌..పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటారు. ఉత్సవానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. షాన్‌ మర్వాడీ జాతికి చెందిన గుర్రమని చెప్పారు.

ఇది గుర్రాల పరుగుపందెంలో ఛాంపియన్‌గా నిలిచిందని చెప్పారు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేగానికి మించి, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో షాన్‌ పరిగెడుతుందన్నారు. ఈ గుర్రం ఖరీదు రూ. 10 కోట్లని తెలిపారు. కాగా చెతక్ ఉత్సవానికి రాజస్థాన్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 500 గుర్రాలను తీసుకువచ్చి ప్రదర్శిస్తున్నారు. అలా ప్రదర్శనలో ఉన్న అన్ని గుర్రాల కంటే ‘షాన్’ వెరీ వెరీ స్పెషల్ గా అందరినీ ఆకర్షిస్తోంది. కళ్లు తిప్పుకోనివ్వని రాజసం ఈ ‘షాన్’ సొంతం అనిపిస్తోంది.