పదేళ్లకు నిండిన సరళాసాగర్‌..విశేషమేమంటే..!

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి స్థాయిలో నిండింది. సరళా సాగర్‌ అనగానే అందరికి ముం దుగా గుర్తొచ్చేది ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టమ్‌. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే మానవ ప్రమేయం (ఆపరేటర్‌) సహాయం లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్‌లు తెరుచుకొని నీటిని కిందకు విడుదల చేస్తాయి. ఇలాంటి సాంకేతికత ఉన్న ప్రాజెక్టు ల్లో ఆసియా ఖండంలో ఇదే మొదటిది. ప్రపంచంలోనే రెండవది సరళా సాగర్‌ కావడం విశేషం. మదనాపురం […]

పదేళ్లకు నిండిన సరళాసాగర్‌..విశేషమేమంటే..!
Follow us

|

Updated on: Nov 01, 2019 | 8:37 PM

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి స్థాయిలో నిండింది. సరళా సాగర్‌ అనగానే అందరికి ముం దుగా గుర్తొచ్చేది ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టమ్‌. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే మానవ ప్రమేయం (ఆపరేటర్‌) సహాయం లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్‌లు తెరుచుకొని నీటిని కిందకు విడుదల చేస్తాయి. ఇలాంటి సాంకేతికత ఉన్న ప్రాజెక్టు ల్లో ఆసియా ఖండంలో ఇదే మొదటిది. ప్రపంచంలోనే రెండవది సరళా సాగర్‌ కావడం విశేషం. మదనాపురం మండల పరిధిలోని ఊకశెట్టు వాగుపై 1947లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళమ్మ పేరు మీద సరళాసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. దీనిని 1949లో ప్రారంభించారు. అర టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు కింద సుమారు 4,500 ఎకరాలకు సాగు నీరందుతోంది. సైఫన్స్‌ ప్రత్యేకత… ప్రాజెక్టులో నాలుగు ప్రైమరీ సైఫన్లు, 17 ఉడ్‌ సైఫన్లు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నీరు వచ్చిన వెంటనే ప్రైమరీ సైఫన్‌లు తెరుచుకుంటాయి. క్రమేణా ఇన్‌ఫ్లో ఎక్కువగా కొనసాగుతుంటే ఉడ్‌ సైఫన్ల ద్వారా నీరు కిందకు ప్రవహిస్తుంది. ఒక్క ప్రైమరీ సైఫన్‌ 500 క్యూసెక్కులు, ఒక్క ఉడ్‌ సైఫన్‌ 2450 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తాయి. చివరి సారిగా 2009 సంవత్సరం సెప్టెంబర్‌లో సైఫన్‌ల ద్వారా నీరు విడుదలైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..సరళాసాగర్‌కు పూర్తి స్థాయిలో నీరు వస్తున్న క్రమంలో పర్యాటకులు, పరిసర ప్రాంతాల రైతులు, పశువుల కాపర్లు వాగులోకి వెళ్లరాదని అధికారులు సూచించారు. 1983లో వనపర్తి డిగ్రీ కాలే జీకి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు ప్రాజెక్టు కింద ఫొటోలు దిగుతుండగా సైఫన్‌లు ఓపెన్‌ కావడంతో నీటిలో కొట్టుకుపోయారు.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.