రాజీవ్ కుమార్‌కు పాక్షిక ఊరట

తనను సీబీఐ ముందు హాజరుకావల్సిందిగా ఆ సంస్థ జారీ చేసిన షోకాజ్ నోటీసులు రద్దు చేయాలంటూ కోల్‌కతా మాజీ కమిషనర్ రాజీవ్ కుమార్ దాఖలు చేసిన అభ్యర్థనను కోల్‌కతా హైకోర్టు అంగీకరించింది. అయితే ఆయన తన పాస్‌పోర్టును డిపాజిట్ చేయాలని, సీబీఐకి సహకరించాలని షరతులు విధించింది. అలాగే సీబీఐ అధికారులు ప్రతిరోజు సాయంత్రం 4గంటల ప్రాంతాలో ఆయన ఇంటికి వెళ్లాలని కోర్టు సూచించింది. నగరం విడిచి వెళ్లరాదని ఆదేశిస్తూనే నెల రోజుల పాటు ఆయనపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని సూచించింది. జూన్ 12న తదుపరి విచారణ జరగాలని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనకు పాక్షిక ఊరట లభించినట్లైంది. కాగా పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో రాజీవ్ కుమార్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *