Sanskrit In Universities:మనం మరచిన మన ప్రాచీన భాషకు పట్టం కట్టిన ప్రపంచం.. దేవభాషలో బోధిస్తున్న అనేక యూనివర్సిటీలు

భారత దేశంలో గల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం. ఆధునికత పేరుతో మనం సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడుతున్నట్లే.. మన ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని కూడా..

Sanskrit In Universities:మనం మరచిన మన ప్రాచీన భాషకు పట్టం కట్టిన ప్రపంచం..  దేవభాషలో బోధిస్తున్న అనేక యూనివర్సిటీలు
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Jan 07, 2021 | 9:33 PM

Sanskrit In Universities: భారత దేశంలో గల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం. ఆధునికత పేరుతో మనం సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడుతున్నట్లే.. మన ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని కూడా మరచిపోయాం. అయితే మనం మరచిన ఈ భాషను ప్రపంచ దేశాలు ఆదరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సంస్కృతభాష.. ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటోంది. ఈ భాష విశిష్టతను గుర్తించిన అనేక దేశాలు నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతం జర్మనీ, ఆస్టేలియా, ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్ లాండ్, బెర్లిన్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, రష్యా, స్వీడన్, స్విట్జర్లాండ్, జపాన్, అమెరికా, భూటాన్, చైనా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో కనీసం ఒక యూనివర్సిటీ లోనైనా టెక్నీకల్ కోర్సులను సంస్కృతంలో బోధిస్తున్నారు. జర్మనీలో అయితే ఏకంగా 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.

ఇక ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన కేంద్రం నాసా ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే అని స్పష్టం చేసింది. ప్రస్తుతం నాసా వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నట్లు సమాచారం. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోందని తెలుస్తోంది. 1987 లో ఫోర్బ్స మ్యాగజైన్ కంప్యూటర్‌కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చని చెప్పింది. అంతేకాదు దేవభాష విశిష్టతను తెలుపుతూ.. ఈ భాష మాట్లాడుతుంటే మనిషి యొక్క నాలుకలోని మాంసగ్రంథులన్నీ స్పందిస్తాయని ప్రపంచంలోని ఏ భాషల ఉచ్చారణలోనూ ఇది జరగదని తెలిపింది.

సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావని.. ఆ భాష మాట్లాడుతుంటే.. ఏకాగ్రత పెరుగుతుందని.. స్పీచ్ థెరపీకి ఈ భాష అత్యంత ఉపయోగకరమని అమెరికన్ హిందూ యూనివర్సిటీ వెల్లడించింది. సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని తస పరిశోధన ద్వారా తెలుసుకున్న ఇంగ్లాడ్ .. ప్రతి పాఠశాల్లో సంస్కృత భాషను తప్పని సరి చేసింది. అదే బాటలో ఐర్లాండ్ కూడా నడుస్తూ ప్రతి విద్యార్థి సంస్కృతాన్ని నేర్చుకునేలా చర్యలు చేపట్టింది. ఇక ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వ్రాసే అల్గార్ థెమ్స్ సంస్కృతభాషలోనే రాయబడి ఉన్నాయనే విషయం తెలిసిందే.. ఇంతటి విశిష్టతను కలిగిన మన దేవభాషను మన భావితరాలకు ప్రభుత్వాలు అందించేలా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భాషా పండితులు కోరుతున్నారు.

ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?