హైటెక్‌ హరిదాసు..లుక్‌ అదిరింది..

ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది. మూడు రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో హరిలో రంగ హరీ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు అప్‌డేట్‌ అయ్యారు. టెక్నాలజీకి అనుగుణంగా మారిపోయారు. డిజిటల్‌ యుగంలో తామూ అప్‌డేట్‌ అయ్యామంటున్నారు. హరిదాసుల నయాలుక్కు చూసిన ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే […]

హైటెక్‌ హరిదాసు..లుక్‌ అదిరింది..
Follow us

|

Updated on: Dec 18, 2019 | 7:04 PM

ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది. మూడు రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో హరిలో రంగ హరీ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు అప్‌డేట్‌ అయ్యారు. టెక్నాలజీకి అనుగుణంగా మారిపోయారు. డిజిటల్‌ యుగంలో తామూ అప్‌డేట్‌ అయ్యామంటున్నారు. హరిదాసుల నయాలుక్కు చూసిన ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. సూర్యోదయానికి ముందే శ్రీ కృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. తలపై అక్షయపాత్ర, ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ శ్రీ కృష్ణ గానాన్ని కీర్తిస్తూ గ్రామవీధుల్లో సంచరిస్తారు. శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు.

హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. అటువంటి హరిదాసులు ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. మారిన కాలానికి అనుగుణంగా హరిదాసుల యాచన తీరూ మారింది. ఇప్పుడంతా హైటెక్‌ పద్ధతి.  ట్రెండ్‌కు తగ్గట్లు హరిదాసుల స్టైలూ మారింది. ఒకప్పుడు చేతిలో చిడతలు పట్టుకుని గజగజవణికించే చలిలో కాలినడకన చెప్పులు కూడా లేకుండా ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేసిన హరిదాసులు నయా టెక్నాలజీకి కనెక్ట్‌ అయ్యారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీఠ వేస్తూనే వృతిని కాపాడుకుంటున్నారు.

పల్లె వీధుల్లో నడిచే పనిలేకుండా నెత్తిన అక్షయపాత్ర మోయకుండా హరికీర్తనలు సైతం పాడకుండా కొత్త విధానానికి తెరలేపారు. తలపై ఉండాల్సిన అక్షయపాత్రను బైక్‌ హెడ్‌ డూమ్‌ దగ్గర అమర్చుకుని బైక్‌పై ఠీవిగా కూర్చుని ఇల్లిల్లూ తిరిగేస్తున్నారు. నోటికి పనిచెప్పకుండా టేప్‌రికార్డ్, సౌండ్ బాక్స్‌ను పెట్టేసి హరికీర్తనలను ఓ రేంజ్‌లో వినిపిస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ తమపని పూర్తిచేసుకుంటున్నారు. దూరాభారం, సమయం కలిసి వస్తున్నందున హరిదాసులు ఇలా బైక్‌లను ఆశ్రయిస్తున్నామని చెబుతున్నారు. తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తోన్న వృత్తిని సైతం వదులుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ నయా లుక్కులో హరిదాసుల గెట్టప్‌ అదిరంటున్నారు పలువురు.

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..