నగరవాసులకు రైల్వే షాక్.. రెండింతలు పెరిగిన టిక్కెట్ ధరలు..!

పండుగ వస్తే చాలు.. రైల్వే స్టేషన్లు కిక్కిరిపోతాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారిని ట్రైన్ ఎక్కించేందుకు సమీప బంధువులు, కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్ వెళ్తుంటారు. అయితే వీరిని ట్రైన్ ఎక్కించేందుకు రైల్వే స్టేషన్‌లోనికి కూడా వెళ్తుంటారు. ఆ సమయంలో వీరంతా ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలి. అయితే సాధారణంగా దీని ధర రూ.10 గా ఉండేది. అయితే నగంరంలోని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఈ ప్లాట్ ఫాం టికెట్ ధర రెండింతలు […]

నగరవాసులకు రైల్వే షాక్.. రెండింతలు పెరిగిన టిక్కెట్ ధరలు..!
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 6:11 AM

పండుగ వస్తే చాలు.. రైల్వే స్టేషన్లు కిక్కిరిపోతాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారిని ట్రైన్ ఎక్కించేందుకు సమీప బంధువులు, కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్ వెళ్తుంటారు. అయితే వీరిని ట్రైన్ ఎక్కించేందుకు రైల్వే స్టేషన్‌లోనికి కూడా వెళ్తుంటారు. ఆ సమయంలో వీరంతా ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలి. అయితే సాధారణంగా దీని ధర రూ.10 గా ఉండేది. అయితే నగంరంలోని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఈ ప్లాట్ ఫాం టికెట్ ధర రెండింతలు పెరిగింది. ఏకంగా రూ.10 నుంచి రూ.20కి పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చారు. అయితే ప్రయాణీకుల రద్దీని ఊహించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ నెల 9వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఈ ధరలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ధరలను పెంచామని.. ఇలా చేయడం ద్వారా ప్రయాణికులతో పాటు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, ఇతరుల రద్దీని నియంత్రించేందుకే కాస్త ఉపయోగంగా ఉంటుందని.. అందుేకే చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు స్పష్టం చేశారు.