Sankranti: శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోహత్సవాలు.. ఆలయ ప్రాంగణంలో వైభవంగా భోగి పండుగ నిర్వహణ..

Sankranti: శ్రీశైలం మహాక్షేత్రంలో బోగి పండుగను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. వైదిక సాంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం..

  • Shiva Prajapati
  • Publish Date - 8:43 pm, Wed, 13 January 21
Sankranti Celebrations in Srisailam

Sankranti: శ్రీశైలం మహాక్షేత్రంలో బోగి పండుగను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. వైదిక సాంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం అధికారులు, అర్చకులు ఇవాళ వేకువజామున భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ భ్రమరాంబమల్లిఖార్జున స్వామివార్లకు ప్రాతఃకాల పూజలు, మహా మంగళ హారతులు పూర్తయిన తరువాత ఈ భోగి మంటలను వేశారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర్ మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా వేసే భోగి మంటలకు మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందన్నారు. భోగి మంటలు వేయడం వలన దుష్ట పీడలు, అమంగళాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని చెప్పారు.

ఇక దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక భోగి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాల వయస్సు గల చిన్న పిల్లలకు భోగి పండ్లు వేశారు. దాదాపు 140 మందికి పైగా చిన్నారులకు ఈ భోగి పండ్లు వేశారు. ఆ తరువాత అర్చక స్వాములు, వేదపండితులు చిన్నారులను ఆశీర్వదించారు. ఈ భోగి పండ్లను వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి దృష్టి దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని అర్చకస్వాములు చెప్పారు.

Also read:

Delhi Schools: ఢిల్లీలో 18 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు.. ఆ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతి

Ravi Teja Khiladi : జోరు పెంచిన మాస్ మహారాజ్.. ‘ఖిలాడి’మూవీ టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ .?