సంక్రాంతికి దోచేస్తోన్న ప్రవేట్ ట్రావెల్స్..రంగంలోకి ఆర్టీఏ

సంక్రాంతి నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ సామాన్యులను టార్గెట్ చేశాయి. సోంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రజలకు టిక్కెట్ ధరలతో చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఫ్యామిలీతో కలిసి ఊరెళ్లడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధిక ఛార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతోన్న బస్సుల యజమానులపై 25 కేసులు నమోదు చేశారు. ఇక విజయవాడలో కూడా దాదాపు 30 […]

సంక్రాంతికి దోచేస్తోన్న ప్రవేట్ ట్రావెల్స్..రంగంలోకి ఆర్టీఏ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2020 | 2:49 PM

సంక్రాంతి నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ సామాన్యులను టార్గెట్ చేశాయి. సోంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రజలకు టిక్కెట్ ధరలతో చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఫ్యామిలీతో కలిసి ఊరెళ్లడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధిక ఛార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతోన్న బస్సుల యజమానులపై 25 కేసులు నమోదు చేశారు. ఇక విజయవాడలో కూడా దాదాపు 30 బస్సులపై కేసులు నమోదయ్యాయి.

మరోవైపు పండుగ నేపథ్యంలో నేడు నగరం నుంచి భారీగా ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫాస్ట్ ట్యాగ్ గేట్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.