ఆదిత్య థాక్రే పేరెందుకు ? మీడియాపై సంజయ్ రౌత్ మండిపాటు

సుశాంత్ కేసులో మంత్రి ఆదిత్య థాక్రే పేరును మీడియా లాగుతోందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. సుశాంత్ మృతి కేసుతో ఆదిత్య కు లింక్ పెట్టేందుకు..

ఆదిత్య థాక్రే పేరెందుకు ? మీడియాపై సంజయ్ రౌత్ మండిపాటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2020 | 4:49 PM

సుశాంత్ కేసులో మంత్రి ఆదిత్య థాక్రే పేరును మీడియా లాగుతోందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. సుశాంత్ మృతి కేసుతో ఆదిత్య కు లింక్ పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అసలు దీంతో ఆదిత్యకు సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.ముంబై పోలీసులు ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఆయన పేరే రాలేదని రౌత్ పేర్కొన్నారు. నేషనల్ మీడియా అనవసరంగా ఆదిత్య పేరును లాగుతోంది.. శివసేన ఆధ్వర్యంలో ఈ  ప్రభుత్వం ఉండడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి అని విపక్షాలపైనా ఆయన రుసరుసలాడారు. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు తమ దర్యాప్తును తాము కామ్ గా చేసుకుని పోతున్నారని, నిజమేమిటో త్వరలో బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ చెత్త రాజకీయాలు మానండి అని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ కి సవాలుగానా అన్నట్టు బీహార్ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు  లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించారు. వినయ్ తివారీ అనే తమ పోలీసు అధికారిని ముంబై పోలీసులు క్వారంటైన్ సాకుతో అదుపులోకి తీసుకున్నారని వారు ఆరోపించారు. తమ నలుగురు పోలీసుల బృందం దర్యాప్తును ముంబై ఖాకీలు అడ్డుకున్నారని వారు పేర్కొన్నారు.