నా సినిమాల నుంచి సుశాంత్‌ను ఎందుకు తప్పించానంటే..!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు.

నా సినిమాల నుంచి సుశాంత్‌ను ఎందుకు తప్పించానంటే..!
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 5:50 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పోలీసులు విచారించారు. దాదాపు మూడు గంటల పాటు భన్సాలీని ప్రశ్నించిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు.

కాగా సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్‌ లీలా, పద్మావత్(షాహిద్‌ కపూర్ పాత్ర)‌, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో మొదట అవకాశం సుశాంత్‌కే ఇచ్చారని కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనిపై వివరణ ఇచ్చిన భన్సాలీ.. ఆ మూడు చిత్రాలకు సుశాంత్‌ను అనుకున్న విషయం నిజమేనని అన్నట్లు సమాచారం. కానీ సుశాంత్‌ డేట్లు అడ్జెస్ట్‌ అవ్వకపోవడం వలనే ఈ సినిమాల నుంచి అతడిని తప్పించానని భన్సాలీ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుశాంత్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్న సంస్థల గురించి కూడా ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే సుశాంత్‌తో సంజయ్‌కు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈ క్రమంలో భన్సాలీ తెరకెక్కించిన పలు చిత్రాల్లో మొదటి అవకాశం సుశాంత్‌కే ఇచ్చారు. అంతేకాదు పద్మావత్ షూటింగ్‌ సమయంలో భన్సాలీపై దాడి జరగ్గా.. అప్పుడు సుశాంత్‌ ఆయనకు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్‌ చనిపోయే ముందు ట్వీట్లు చేసి డిలీట్ చేసినట్లు తెలుస్తుండగా.. ఈ విషయంపై పోలీసులు ట్విట్టర్‌ సంస్థకు లెటర్‌ను రాశారు.