‘పేదోళ్ల బియ్యంతో ధనికుల కోసం శానిటైజర్లా ?’ రాహుల్ ఫైర్

సెంట్రల్ గోడౌన్లలో పరిమితికి మించి ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఈథనాల్ గా మారుస్తామని, దానితో శానిటైజర్లు తయారు చేయడమే గాక.. కాలుష్యాన్ని తగ్గించడానికి ఆ ఈథనాల్ ను పెట్రోలుకు కూడా కలుపుతామని కేంద్రం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పేదవారికి వినియోగించాల్సిన బియ్యాన్ని ధనికుల చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడుతారా అని ఆయన మండిపడ్డారు. దాదాపు నెలరోజులుగా దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉండగా లక్షలాది పేదలు పట్టెడన్నం కోసం అంగలారుస్తున్న ఈ […]

'పేదోళ్ల బియ్యంతో ధనికుల కోసం శానిటైజర్లా ?' రాహుల్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2020 | 4:32 PM

సెంట్రల్ గోడౌన్లలో పరిమితికి మించి ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఈథనాల్ గా మారుస్తామని, దానితో శానిటైజర్లు తయారు చేయడమే గాక.. కాలుష్యాన్ని తగ్గించడానికి ఆ ఈథనాల్ ను పెట్రోలుకు కూడా కలుపుతామని కేంద్రం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పేదవారికి వినియోగించాల్సిన బియ్యాన్ని ధనికుల చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడుతారా అని ఆయన మండిపడ్డారు. దాదాపు నెలరోజులుగా దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉండగా లక్షలాది పేదలు పట్టెడన్నం కోసం అంగలారుస్తున్న ఈ తరుణంలో ఈ నిర్ణయమేమిటని ఆయన ప్రశ్నించారు. ‘ఈ దేశంలోని పేదలు ఎప్పుడు బాగుపడతారు ? మీరంతా ఆకలితో మరణిస్తుంటే వాళ్ళు (కేంద్రం) మీకు చెందాల్సిన బియ్యంతో డబ్బున్న మారాజుల చేతులు శుభ్రం చేసే శానిటైజర్ల తయారీకోసం వాడుతున్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

బయో ఫ్యుయల్ పై గల జాతీయ విధానం కింద మిగులు ఆహార ధాన్యాన్ని ఈథనాల్ గా మార్చవచ్చునట… దీంతో ఇది మంచి ఆలోచన అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన నేషనల్ బయో ఫ్యుయల్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.