100 సార్లకి పైగా వాడుకునేలా అరటితొక్క శానిటరీ న్యాప్‌కిన్స్

Sanitary Napkins made from Banana Fiber, 100 సార్లకి పైగా వాడుకునేలా అరటితొక్క శానిటరీ న్యాప్‌కిన్స్

అరటిపండుతో మనకు ఎన్నిఉపయోగాలు ఉన్నాయో.. తెలుసు. ఒక్క అరటిపండు.. ఆపిల్‌తో సమానం. ఒక ఆపిల్‌ల్లో ఎన్ని ఉపయోగాలుంటాయో.. అరటిపండులో కూడా అన్ని ఉపయోగాలుంటాయి. అన్నిరకాల జబ్బుపడిన రోగులు కూడా వీటిని తినవచ్చని డాక్టర్లు ఇప్పటికే చెప్పారు. అలాగే.. అరటిపండు అన్ని దేశాల్లోనూ విరివిగా దొరికే పండు. అతితక్కువ ధరలోనే.. కడుపునింపేవి కూడా అంటారు.

అయితే.. అరటిపండులో పండు తినేసి.. తొక్క పడేస్తాం.. కానీ.. ఆ తొక్కతో శానిటరీ నాప్‌కిన్లు తయారవుతాయనే విషయం మీకు తెలుసా..! ఏంటి షాక్‌ అయ్యారా..! అవును.. అరటి తొక్కతో మరో కొత్త ప్రయోగం చేసి వహ్వా.. అనిపించారు ఢిల్లీ ఐఐటీకి చెందిన స్టార్టప్ సంస్థ శాస్త్రవేత్తలు. నిజానికి శానిటరీ న్యాప్‌కిన్ల తయారీకి ప్లాస్టిక్ మరియు సింథటిక్ పదార్థాలు వాడుతూంటారు. వాటివల్ల పర్యావరణానికి హాని తప్ప లాభం ఉండదు. అయితే.. ఇలా వినూత్నంగా ఆలోచించి అందరితో.. శభాష్ అనిపించుకుంటున్నారు ఐఐటీ స్టార్టప్ శాస్త్రవేత్తలు. అయితే.. ఈ న్యాప్‌కిన్లను దాదాపు 100 సార్లకు పైగా వాడుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం వీటిని ఒకటి రూ.100లకు విక్రయిస్తున్నారు. అలాగే.. వీటిపై పెటెంట్స్ ‌రైట్స్ పొందేందుకు ట్రై చేస్తున్నారు.

Sanitary Napkins made from Banana Fiber, 100 సార్లకి పైగా వాడుకునేలా అరటితొక్క శానిటరీ న్యాప్‌కిన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *