Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

మళ్లీ రేస్‌లోకి సానియా..రాకెట్‌తో రెడీ..!

Sania Mirza set to make a comeback, మళ్లీ రేస్‌లోకి సానియా..రాకెట్‌తో రెడీ..!

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది. 2018 అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా కొద్దికాలంగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాస్త బరువు కూడా పెరిగింది. మరోసారి కోర్టులోకి దిగి డబుల్స్‌ ప్లేయర్‌గా ఆరాటపడిన ఆమె తిరిగి ఫిట్‌గా మారేందుకు విపరీతంగా కష్టపడింది. రోజుకు 5 నుంచి 6 గంటల పాటు జిమ్‌లో వర్కవుట్లు చేసింది. దీంతో కేవలం 4 నెలల్లోనే 26 కేజీల బరువు తగ్గి ఔరా అనిపించింది. ఇప్పుడు పూర్తి పిట్‌గా మారిన సానియా ప్రత్యర్థులకు రెడీ అంటూ వార్నింగ్ ఇస్తోంది.

కాగా 2017లో చైనా ఓపెన్‌ సమయంలో సానియా మోకాలుకు గాయమైంది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడంతో దాదాపు రెండున్నర ఏళ్లు టెన్నిస్‌కు దూరమైంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకున్న సానియా..గతంలో మహిళల డబుల్స్‌ నెంబర్ ర్యాంకుని కూడా చేరుకుంది. కాగా ఇప్పుడు ఫూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఈ ఏస్ టెన్నిస్ ప్లేయర్..జనవరి 11 నుంచి జరిగనున్న డబ్ల్యూటీఏ హోబర్ట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్దమైంది. మహిళల డబుల్స్‌ కేటగిరిలో నదియా కిచెనక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి.. మిక్స్‌డ్‌ కేటగిరిలో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి రేస్‌లోకి దిగబోతుంది.

Related Tags