Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తిరుపతి.... డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.... శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటాం. నిధులు దుర్వినియోగం కానీయం. నెలరోజుల్లో 16.73 కోట్లు శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం లభించింది.
  • ఆత్రేయపురం ప్రేమకథ దర్శకుడు దేవరాయ రమేష్ అలియాస్ రవితేజ అలియాస్ రావణ్ బిక్షూ. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి. ఆధారాలు టివి9 కే అందించాలి. ఎటువంటి కేసులు ఎదుర్కోవటానికైనా సిద్దంగా ఉన్నా. నా దగ్గర స్ర్కిప్టు తీసుకెళ్ళిన కో డైరెక్టర్ భార్గవి నాపైనే ఆరోపణలు చేస్తోంది. హీరో, ఇతర ఆర్టిస్ట్ లతో ఫోన్ లో మాట్లాడిన రావణ్ భిక్షూ.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • నగరంలో మరొకసారి ఆక్సిజన్ సిలిండర్ల పట్టివేత. ముషీరాబాద్ లో 34 సిలెండర్లని ఆక్సిజన్ సిలిండర్ ను సీజ్ చేసిన అధికారులు. అనుమతులు లేకుండా సిలిండర్ విక్రయిస్తున్న బాబా ట్రేడర్స్. అధిక ధరకు సిలిండర్లను అమ్ముతున్న సర్దార్ ఖాన్ ను అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు.

నీటిలో మునిగిన సంగమేశ్వరుడు..!

Sangameswara Temple Submerged due to Srisailam Back Water, నీటిలో మునిగిన సంగమేశ్వరుడు..!

సంగమేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమ ప్రదేశంలో వెలిసింది. అందుకే ఈ ఆలయానికి సంగమేశ్వరాలయం అని పేరొచ్చింది. కాగా.. గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగమేశ్వర ఆలయలోకి నీరు పొటెత్తింది. దీంతో… ఆలయం మొత్తం నీటిలో మునిగిపోయి.. కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. దీంతో.. పూజారులు ఆలయ శిఖరానికి పూజలు చేసి.. సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతీ సంవత్సరం ఈ ఆలయం నీటిలో మునుగుతుంది.

వరద కారణంగా శ్రీశైలం రిజర్వాయర్‌ నిండింది. దీంతో.. జలాశయం జలసిరితో కళకళలాడుతోంది. జూరాల నుంచి పరుగులు పెడుతూ వస్తోన్న శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో సంగమేశ్వర ఆలయం క్రమంగా నీటిలో మునిగిపోయింది. కాగా.. మరో కొద్ది రోజులు గుడి పూర్తిగా నీటిలో మునిగిపోనుంది. కాగా.. నిన్న సాయంత్రానికి జలాశయంలో 100 టీఎంసీల నీరు చేరుకోగా, నీటిమట్టం 858 అడుగులు దాటింది. అయితే.. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద మరో నాలుగు రోజులు రావచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో.. మరో 50 టీఎంసీలకు పైగా నీరు చేరే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

Sangameswara Temple Submerged due to Srisailam Back Water, నీటిలో మునిగిన సంగమేశ్వరుడు..!

Related Tags