సైకత శిల్పంతో.. చంద్రయాన్2

Sand Art On Chandrayaan-2 By Sudarsan Pattnaik, సైకత శిల్పంతో.. చంద్రయాన్2

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్‌-2. జూలై 22న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. అది ఈరోజు ఉదయం 9.30గంటలకు భూ కక్ష్య నుంచి చంద్రుని క్షక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. “మేక్‌ ఆర్‌ బ్రేక్‌” గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్‌2ను జాబిల్లికి మరింత చేరువ చేశారు. ఈ సందర్భంగా భారత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించిన ఆయన.. చంద్రయాన్‌-2 వ్యోమనౌక చందమామవైపుకు దూసుకెళ్తున్నట్లుగా రూపోందించారు. దానిపై “జయ హో ఇండియా” అని రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *