Breaking News
  • ట్విట్టర్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు: శతాబ్దల కల అయోధ్య లోని రామాలయం యొక్క శంకుస్థాపన ... ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే , ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం . దీనిపై బిజెపి లో వున్న అనేక మంది ప్రస్తావించారు . యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు . ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి .
  • కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల ప్రజలను ఈ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కరోనా మహమ్మారి త్వరగా పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా భారిన పడకుండా రక్షించుకోవచ్చు
  • స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌నే వాడాల‌న్న అల్లు శిరీష్ అభిలాష‌ను ప్ర‌శంసించిన అల్లు అర్జున్‌. ఇండియ‌న్ ప్రాడెక్టులు వాడ‌టం, ప్ర‌మోట్ చేయ‌డం హ్యాపీగా ఉంద‌ని ట్వీట్‌. అల్లు శిరీష్ ని చూస్తే గ‌ర్వంగా ఉంద‌న్న బ‌న్నీ. జైహింద్ అని స్వాతంత్ర‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పిన బ‌న్నీ.
  • డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా' సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌ క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే సినిమాల‌నే చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. 560కి పైగా చిత్రాల‌లో న‌టించిన ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ కోసం స్క్రిప్టులు రాయ‌డం అనేది అనేక‌మంది ద‌ర్శ‌కుల‌కు ఓ ఛాలెంజ్. లేటెస్ట్‌గా డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా' అనే సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. ఇందులో ఆయ‌న క‌థానాయ‌కునిగా న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాపుల‌ర్ స్క్రిప్ట్‌/ డైలాగ్ రైట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
  • అమరావతి: విపత్తుల నిర్వహణ శాఖ. గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. కాసేపట్లో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 9,26,446 క్యూసెక్కులు. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ. ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపిన విపత్తుల శాఖ. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్. బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్.
  • తెలంగాణలో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం. అత్యధికంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు లో 27.3 సెంటీమీటర్ల వర్షపాతం. వరంగల్ రూరల్ లో 22 నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం. సిద్దిపేట జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం. వరంగల్ అర్బన్, ములుగు జిల్లాల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం. నగరంలో లో చార్మినార్ ,కీసర, హయత్ నగర్, బహుదూర్ పుర, రాజేందర్ నగర్ ,ఆసిఫ్ నగర్ , సరూర్నగర్ , మాదాపూర్, నాంపల్లి ఏరియాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం.

చైనాలో ఉత్ప‌త్తిని నిలిపివేసిన శామ్‌సంగ్‌ ఎల‌క్ట్రానిక్స్..!

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, చైనాలోని తన చివరి కంప్యూటర్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిల‌పివేస్తున్న‌ట్లు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శనివారం తెలిపింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి
Samsung Electronics to halt production, చైనాలో ఉత్ప‌త్తిని నిలిపివేసిన శామ్‌సంగ్‌ ఎల‌క్ట్రానిక్స్..!

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, చైనాలోని తన చివరి కంప్యూటర్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలి‌పివేస్తున్న‌ట్లు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శనివారం తెలిపింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి త‌మ‌ ఉత్పత్తిని మారుస్తున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. పెరుగుతున్న కార్మిక వ్యయాలు, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్‌-19 సంక్షోభం వంటి అంశాలు ఇందుకు కార‌ణంగా కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సుజౌ కంప్యూటర్‌లో కాంట్రాక్టులో ఉన్న 1,700 మంది ఉద్యోగులు ప్ర‌భావితం కానున్నారు. పరిశోధన, అభివృద్ధిలో పాల్గొన్న వారిని మినహాయించి సిబ్బందికి కంపెనీ నోటీసు ఇచ్చింది.

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కు చైనాలోని సుజౌ, జియాన్లలో రెండు సెమీకండక్టర్ తయారీ సైట్లు ఉన్నాయి. ఈ కర్మాగారం 2012 లో 4.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను రవాణా చేసింది. ఇది 2018 నాటికి 1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫ్యాక్ట‌రీ ఆదాయం, సరుకుల గురించి, ఉద్యోగులకు సంబంధించిన వివరాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్ర‌తినిధి నిరాకరించారు. శామ్‌సంగ్‌కు సంబంధించి చైనా ఒక ముఖ్య‌మైన మార్కెట్ గా ఉందని చైనా వినియోగదారులకు తాము సేవలను అందిస్తూనే ఉంటామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. శామ్‌సంగ్ గత ఏడాది చైనాలో తన చివరి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీని మూసివేసింది.

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ

Related Tags