బర్నింగ్ స్టార్.. బర్నింగ్ బ్లాస్ట్ రికార్డ్స్.. 9 కోట్లు ఫ్యాన్స్ కోసం..!

Sampoornesh Babu Kobbari Matta Movie Collections

‘హృదయకాలేయం’ సినిమాతో టాలీవుడ్‌‌లో సంపూ సన్సేషనల్ సృష్టించాడు. ఈ సినిమాతో బర్నింగ్ స్టార్‌గా సంపూర్ణేష్ బాబుకు మంచి పేరు వచ్చింది. అనంతరం బిగ్‌బాస్‌లోకి వెళ్లాడు. కానీ.. అక్కడి వాతావరణంలో ఉండలేక.. మొదటివారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం ‘కొబ్బరి మట్ట’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఫుల్ పైసా వసూల్ సాధించాడు.

గత శనివారం రిలీజ్‌ అయిన ఈ సినిమా విజయవంతంగా.. ఫుల్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లు నటించిన సంపూ.. కామెడీ పంచ్‌లతో అదరగొట్టాడు. ఈ సినిమా విడుదలైన మూడురోజుల్లోనే దాదాపు 12 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన సినిమా పోస్టర్‌లో.. చిత్ర యూనిట్ మెన్‌షన్ చేశారు. కానీ.. కింద ఓ క్యాప్షన్ యాడ్ చేసి.. 9 కోట్లు ఫ్యాన్స్ కోసం యాడ్ చేసినట్టు.. పంచ్ వేశారు. కానీ.. సంపూ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే మూడు కోట్లు సాధించండం కూడా ఘన విజయమే అంటోంది చిత్ర యూనిట్.

కాగా.. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో నటించి అలరించారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఇషికా సింగ్, షకీలా నటించారు. ఈ సినిమాకి రూపక్ రొనాల్డ్‌ సన్ దర్శకత్వం వహించగా, సాయి రాజేశ్ నీలం నిర్మాతగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *