సంపూ కోసం సెల్ టవరెక్కిన బర్నింగ్ ఫ్యాన్!

Sampoornesh Babu Fan Climbs Cell Tower For Kobbari Matta Movie
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ను మదనపల్లెలో విడుదల చేయలేదని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన డి.రామచంద్ర కుమారుడు రెడ్డెప్ప(23) టూవీలర్‌ మెకానిక్‌. శనివారం విడుదలైన ‘కొబ్బరిమట్ట’ మదనపల్లెలో తప్ప.. అన్ని చోట్లా విడుదలైంది. దీంతో రెడ్డెప్ప తన స్నేహితులతో కలిసి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. సినిమాను విడుదల చేయాలనీ దర్శక నిర్మాతలను కోరాడు. అయితే వారు స్పందించకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక అయోధ్యనగర్‌లోని ఓ సెల్‌టవరెక్కాడు. గమనించిన స్థానికులు వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు.
స్టార్ హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు గానీ.. సంపూ సినిమాను మాత్రం రిలీజ్ చేయరా అంటూ నానా హంగామా చేశారు. దీనిపై పోలీసులను కూడా ప్రశ్నించాడు. వారికీ ఏమి చేయాలో తెలియక రెడ్డెప్ప చిన్నమ్మ కుమారుడు ప్రశాంత్‌ను టవర్‌ ఎక్కించి కిందకు దింపే ప్రయత్నం చేశారు. అర్ధగంట అనంతరం రెడ్డెప్ప కిందకు దిగొచ్చాడు. దీంతో అటు పోలీసులు, ఇటు జనం ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *