సమీరారెడ్డి కూతురు పేరు ఎంత వెరైటీగా ఉందో తెలుసా..?

Sameera Reddy Names her Daughter Nyra elder Son hans Reveals news on Instagram, సమీరారెడ్డి కూతురు పేరు ఎంత వెరైటీగా ఉందో తెలుసా..?

హీరోయిన్ సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.. ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ గురించి అప్‌డేట్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు.. ఇదివరకు తాను గర్భవతిగా ఉన్నప్పుడు.. షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో రచ్చ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత సమీరా రెడ్డి ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇద్దరూ హెల్దీగానే ఉన్నారు. తాజాగా.. ఆ పాపకు సమీరా ఫ్యామిలీ నామకరణం కూడా చేశారు. పుట్టిన ఆడపిల్లకు ‘సైరా’ అంటూ ధ్వనించేలా ‘నైరా’ అనే పేరుపెట్టింది. ఈ విషయాన్ని తన కొడుకుతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. సమీరా రెడ్డి కావాలనే తన పాపకు ‘నైరా’ అనే పేరు పెట్టిందంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *