Samantha Pic: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత పిక్.. కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Samantha Pic: టాలీవుడ్‌లో సమంత పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని వారి కోడలుగా, నాగ చైతన్య భార్యగా సుపరిచితురాలు. అంతేకాకుండా

Samantha Pic: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత పిక్.. కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 12:36 PM

Samantha Pic: టాలీవుడ్‌లో సమంత పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని వారి కోడలుగా, నాగ చైతన్య భార్యగా సుపరిచితురాలు. అంతేకాకుండా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది. అంతేకాకుండా ఆహా ప్లాట్‌ఫాం వేదికగా సామ్,జామ్ అనే షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇటీవల సమంత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. తన ప్రతి కదలికను ప్రేక్షకులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్‌తో తనది నాలుగేళ్ల పరిచయం అంటూ ఓ ఫొటో షేర్ చేశారు. అందులో త‌న కాళ్ళను ప్రీత‌మ్ ఒళ్ళో పెట్టినట్లుగా ఉంది. దీంతో ఈ ఫొటోపై ఇప్పుడు నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కార్యక్రమాల‌తో బిజీగా ఉంది. ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్స్‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సామ్ తెగ రచ్చచేస్తుంది.

నయనతారకు షాక్ ఇచ్చిన సమంత, అక్కినేనివారి కోడలుకు అసలు సినిమాలు చేసే ఉద్దేశం ఉందా..?