నవ్విస్తూ.. మనసుకు హత్తుకుంటోన్న ‘ఓ బేబి’ ట్రైలర్

Samantha Oh Baby Trailer, నవ్విస్తూ.. మనసుకు హత్తుకుంటోన్న ‘ఓ బేబి’ ట్రైలర్

సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబి’. కొరియాలో మంచి విజయం సాధించిన ఓ మై గ్రానీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీగా తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత నటన అందరినీ మెప్పిస్తోంది. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది సమంత.

కాగా సెలూన్‌కు వెళ్లిన 70ఏళ్ల బామ.. కొన్ని కారణాల వలన పాతికేళ్ల యువతిలా మారిపోతుంది. ఆ తరువాత ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి..? 70ఏళ్లు వచ్చే వరకు ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి..? అనే విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక ఈ చిత్రంతో సమంత వృద్ధురాలి పాత్రలో సీనియర్ నటి లక్ష్మి కనిపించనుండగా.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, నాగశౌర్య, అడివి శేషు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? సమంతకు ఎలాంటి విజయాన్ని ఇవ్వబోతుంది అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *