‘ఓ బేబి’ సక్సెస్.. సెలబ్రేషన్స్ అదుర్స్

సమంత అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఓ బేబి’. కొరియన్ భాషలో విజయం సాధించిన మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది మూవీ యూనిట్. రామానాయుడు స్టూడియోలో కేక్ కట్ చేసిన టీమ్ స్టూడియో ముందు పటాకులు పేల్చి తీన్‌మార్ డ్యాన్స్ […]

‘ఓ బేబి’ సక్సెస్.. సెలబ్రేషన్స్ అదుర్స్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 08, 2019 | 2:25 AM

సమంత అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఓ బేబి’. కొరియన్ భాషలో విజయం సాధించిన మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది మూవీ యూనిట్. రామానాయుడు స్టూడియోలో కేక్ కట్ చేసిన టీమ్ స్టూడియో ముందు పటాకులు పేల్చి తీన్‌మార్ డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది.

ఇక ఈ సినిమాలో రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య, అడివి శేషు, ప్రగతి తదితరులు కీలకపాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే. కాగా యూఎస్‌లో ఈ సినిమా కేవలం ప్రీమియర్‌లో 1,45,135 డాలర్లు రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. దీంతో ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా ఓ బేబి నిలిచిందని వారు పేర్కొన్నారు.