‘డోరా’ దర్శకుడితో సమంతా..?

స్టార్ హీరోయిన్ సమంతా ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ డ్రామా ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సామ్ తాజాగా ఓ హారర్ సినిమాకు సైన్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు డోస్ రామస్వామి.. సమంతాకు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. దీనికి సమంతా కూడా సముఖంగా […]

  • Ravi Kiran
  • Publish Date - 7:11 pm, Mon, 10 June 19
'డోరా' దర్శకుడితో సమంతా..?

స్టార్ హీరోయిన్ సమంతా ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ డ్రామా ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సామ్ తాజాగా ఓ హారర్ సినిమాకు సైన్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు డోస్ రామస్వామి.. సమంతాకు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. దీనికి సమంతా కూడా సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన తర్వాత తెలుగులోకి డబ్ చేస్తారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా గతంలో నయనతార ప్రధాన పాత్రలో ‘డోరా’ అనే హిట్ సినిమా అందించిన డోస్ రామస్వామి ఈసారి సమంతాతో ఎలాంటి బ్లాక్‌బస్టర్ అందిస్తాడో వేచి చూడాలి.