సమంతా పూర్తి చేసింది..!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ చిత్రంలో హీరోయిన్ సమంతా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తైన పోర్చుగల్ షెడ్యూల్‌లో ఆమె కూడా పాల్గొంది. ఇక ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశాడట దర్శకుడు.

కాగా కోడలుతో కలిసి పని చేయడంపై నాగ్ స్పందిస్తూ ‘ సమంతాతో పనిచేయడం సరదాగా ఉందని ‘ చెప్పాడు. అటు సమంతా కూడా ‘నాగార్జున మామతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాదిస్తుందని’ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *