Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

Chay And Sam: నిర్మాతలుగా మారనున్న లక్కీ కపుల్..?

త్వరలోనే సమంతా, నాగ చైతన్యలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారట...
Samantha And Naga Chaitanya, Chay And Sam: నిర్మాతలుగా మారనున్న లక్కీ కపుల్..?

Samantha And Naga Chaitanya: టాలీవుడ్‌లో సమంతా, నాగ చైతన్యలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇద్దరూ కూడా కథలకు ప్రాధాన్యం ఇస్తూ.. మంచి క్యారెక్టర్లలో నటించి మెప్పించారు. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తాజాగా వీరి గురించి ఓ రూమర్ ఫిల్మ్‌నగర్‌లో హల్చల్ చేస్తోంది.

త్వరలోనే ఈ ఇద్దరూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే కొన్ని కథలను కూడా వింటున్నారని సమాచారం. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకి ఇద్దరూ ఓకే చేసినట్లు వినికిడి. అందులో యువ హీరో రాజ్ తరుణ్ నటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సమంతా తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..

Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

Related Tags