Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

నా రెండో దైవం అమ్మే – సమంతా

Samantha, నా రెండో దైవం అమ్మే – సమంతా

‘మజిలీ’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న అక్కినేని వారి కోడలు సమంతా పై గత కొన్ని రోజులుగా కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వాటిపై స్పందిస్తూ సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమాధానం ఇచ్చింది.

‘అమ్మకి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు . నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మను నమ్ముతాను. ఆమె చేసే ప్రార్ధనలో ఏదో మాయ ఉంటుంది. చిన్నప్పటిలాగే నా గురించి ప్రార్ధన చేయమని అమ్మని ఎప్పుడూ అడుగుతుంటాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. మా అమ్మ మాత్రం తనకోసం తాను ఎప్పుడూ ప్రార్థన చేసుకోదు,అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత. రెండో దైవం తల్లేనంటూ తన తల్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది సమంతా.

ప్రస్తుతం సమంతా లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ అనే సినిమా చేస్తోంది. ఇది కొరియన్ మూవీ “మిస్ గ్రాని” కి అనువాదం.

Related Tags