దబాంగ్ డైరెక్టర్ కామెంట్స్‌పై స్పందించిన స‌ల్మాన్ తండ్రి

కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై దబాంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. కశ్యప్ చేసిన అభియోగాలపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ స్పందించారు. వేరే వారిని నిందించేముందు ఆలోచించుకొని చేయాలని హితవు పలికారు. కశ్యప్ అలా చేయలేదన్నారు. ఇలాంటి ఆరోపణలపై మాట్లాడి స‌మయం వృధా చేసుకోను అని స‌లీం అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందించారు. కొందరు డిప్రెషన్ అని కొందరంటే… నెపోటిజం […]

దబాంగ్ డైరెక్టర్ కామెంట్స్‌పై స్పందించిన స‌ల్మాన్ తండ్రి
Follow us

|

Updated on: Jun 17, 2020 | 9:13 AM

కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై దబాంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. కశ్యప్ చేసిన అభియోగాలపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ స్పందించారు. వేరే వారిని నిందించేముందు ఆలోచించుకొని చేయాలని హితవు పలికారు. కశ్యప్ అలా చేయలేదన్నారు. ఇలాంటి ఆరోపణలపై మాట్లాడి స‌మయం వృధా చేసుకోను అని స‌లీం అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందించారు. కొందరు డిప్రెషన్ అని కొందరంటే… నెపోటిజం కార‌ణంగానే అత‌ను మ‌ర‌ణించాడ‌ని ప‌లువురు ప్రముఖులు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ద‌బాంగ్ డైరెక్ట‌ర్ అభిన‌వ్ క‌శ్య‌ప్ .. స‌ల్మాన్ అత‌ని ఫ్యామిలీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విషయం తెలిసిందే. త‌న కెరీర్ నాశ‌నం కావ‌డానికి వారే కార‌ణం అని, నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన శ‌త్రువులు వార‌ని పెద్ద బాంబు పేల్చారు. ఈ ఆరోపణలు భారతీయ చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీస్తోంది.